విద్య, క్రీడలు, సామాజిక చైతన్యానికి లయన్స్ క్లబ్ చేయూత.
*మానకొండూరులో జిల్లా గవర్నర్ అధికారిక పర్యటన.. ప్రభుత్వ పాఠశాలలకు 1,001 పుస్తకాల పంపిణీ.*
*విద్యార్థులకు క్రీడా సామగ్రి, బాలిక చదువుకు ఆర్థిక సహాయం అందజేత.*
మానకొండూరు, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్, జిల్లా 320-జి ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ లయన్ మోర భద్రేశం అధికారిక పర్యటన సందర్భంగా ఆదివారం మానకొండూరులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లయన్ జి.వి. రామకృష్ణ రావు నాయకత్వంలో ఆయన నివాసంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో 1,001 పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా సామగ్రిని అందజేశారు. మానకొండూరులోని మూడు అంబేద్కర్ కమ్యూనిటీ కేంద్రాలకు ప్రజల్లో సామాజిక అవగాహన పెంపొందించేందుకు రోజువారీ దినపత్రికలను అందించారు. లయన్స్ క్లబ్ ద్వారా విద్యా సహాయం పొందుతున్న ఒక బాలిక చదువుల కోసం ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు.
విద్య, క్రీడలు, సామాజిక చైతన్యం, సమాజ అభివృద్ధి లక్ష్యంగా లయన్స్ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. సేవే లక్ష్యంగా ప్రజలకు అండగా నిలవడమే క్లబ్ ప్రధాన ఆశయమని తెలిపారు.
ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ జిల్లా 320-జి అధ్యక్షుడు లయన్ మైదారం శివకాంత్ అధ్యక్షత వహించగా, కార్యదర్శి లయన్ బత్తో వినోద్, లయన్ కృష్ణ చైతన్య, ఆర్.సి. ఆర్.ఎస్.పి. రెడ్డి, జెడ్.సి. ముక్కా కృష్ణ, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.


Comments