గ్రాడ్యుయేట్ల మద్దతుతో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం.

చాగల్లులో ఉత్సాహం.

గ్రాడ్యుయేట్ల మద్దతుతో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం.

స్టేషన్ ఘన్‌పూర్, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు గ్రామంలో ఆదివారం 8వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికల గ్రాడ్యుయేట్ ఓటు హక్కు నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్లను కలిసి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరగా, గ్రాడ్యుయేట్లు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారు. దాదాపు 15 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకొని ఐడి నంబర్లు ఇవ్వడం జరిగింది. మరో 10 మంది దరఖాస్తు కోసం ప్రూఫ్స్ ఇవ్వడం జరిగింది.గ్రాడ్యుయేట్ల నుంచి వస్తున్న ఈ స్పందన పట్ల బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరును నమోదు చేసేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ పొన్నం రాజేష్, అన్నెపు అనిల్, చిక్కుడు సునీల్, మహమ్మద్ సాదిక్, రంగు రాకేష్, ఆకుల విజయ్, షేక్ ఇమ్రాన్, పొన్నబోయిన శివ, వడ్లకొండ రాంబాబు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రాడ్యుయేట్లకు మరియు తోటి కార్యకర్తలకు నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఓటు హక్కును కాపాడలేని సీఈసీ ఎందుకు? ఓటు హక్కును కాపాడలేని సీఈసీ ఎందుకు?
* జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి * జమ్మికుంట గాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ శాంతియుత నిరసన జమ్మికుంట, నవంబర్ 01 (తెలంగాణ ముచ్చట్లు): దేశ...
రాజవరంలో విషాదం.
నాగేంద్రమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలి.
విద్య, క్రీడలు, సామాజిక చైతన్యానికి లయన్స్ క్లబ్ చేయూత.
నాగేంద్రమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.
పట్టభద్రుల ఓటు నమోదు గడువు మరో 10 రోజులు పొడిగించాలి.