కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలి.

కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలి.

*రైతులకు సాగునీరు అందించాలనే డిమాండ్‌తో 400 కిలోమీటర్ల మహా సైకిల్ యాత్ర.*

*ఐదవ రోజు యాత్రకు గంగాధర ఎక్స్ రోడ్డు వద్ద ఘన స్వాగతం.*

*సైకిల్ తొక్కి సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.*

గంగాధర, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి రైతులకు సాగునీరు అందించాలని, రైతాంగ ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుడు బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో చేపట్టిన 400 కిలోమీటర్ల మహా సైకిల్ యాత్ర ఐదవ రోజుకు చేరుకుంది. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు కొనసాగుతున్న ఈ యాత్రకు చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర ఎక్స్ రోడ్డు వద్ద ఘన స్వాగతం లభించింది.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ యాత్ర బృందానికి పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం స్వయంగా సైకిల్ తొక్కుతూ ఐదవ రోజు యాత్రను ప్రారంభించి తన సంఘీభావాన్ని ప్రకటించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని, రైతాంగ హక్కులను పరిరక్షించాలని యాత్ర బృందం డిమాండ్ చేసింది. రైతుల సంక్షేమం, సాగునీటి సాధన లక్ష్యంగా ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఓటు హక్కును కాపాడలేని సీఈసీ ఎందుకు? ఓటు హక్కును కాపాడలేని సీఈసీ ఎందుకు?
* జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి * జమ్మికుంట గాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ శాంతియుత నిరసన జమ్మికుంట, నవంబర్ 01 (తెలంగాణ ముచ్చట్లు): దేశ...
రాజవరంలో విషాదం.
నాగేంద్రమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలి.
విద్య, క్రీడలు, సామాజిక చైతన్యానికి లయన్స్ క్లబ్ చేయూత.
నాగేంద్రమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.
పట్టభద్రుల ఓటు నమోదు గడువు మరో 10 రోజులు పొడిగించాలి.