పాత మిత్రుల ఆత్మీయ సమ్మేళనం.. మధుర జ్ఞాపకాలతో సందడి.
Views: 595
On
భీమదేవరపల్లి, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988-89 విద్యా సంవత్సరంలో పదో తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం తాము విద్యనభ్యసించిన పాఠశాలలో ఆత్మీయంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమ జీవిత ప్రయాణంలోని అనుభవాలను పరస్పరం పంచుకుంటూ ఆనందంగా గడిపారు. బాల్య స్నేహబంధాలను మరోసారి గుర్తుచేసుకుంటూ ఉత్సాహంగా సందడి చేశారు.
ఏళ్లు గడిచినా చెక్కుచెదరని స్నేహబంధాలకు ఈ ఆత్మీయ సమ్మేళనం నిదర్శనంగా నిలిచింది. పూర్వ విద్యార్థుల కలయికతో పాఠశాల ప్రాంగణం ఆనందోత్సాహాలతో కళకళలాడింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
01 Nov 2026 20:37:53
* జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి
* జమ్మికుంట గాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ శాంతియుత నిరసన
జమ్మికుంట, నవంబర్ 01 (తెలంగాణ ముచ్చట్లు):
దేశ...


Comments