పేదల భూములను లాక్కుంటే సహించం.. పోరాటం ఉధృతం చేస్తాం!

పేదల భూములను లాక్కుంటే సహించం.. పోరాటం ఉధృతం చేస్తాం!

-బీపీసీఎల్ ప్లాంట్ నిర్మాణ సన్నాహాలను తక్షణమే విరమించుకోవాలి

 -దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్

ఎల్కతుర్తి, నవంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఇంధన సిలిండర్ల నింపే కేంద్రం నిర్మాణానికి అధికారులు చేస్తున్న సన్నాహాలను తక్షణమే విరమించుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. పేదల భూములను వారి నుంచి దూరం చేసే ప్రయత్నాలను సహించబోమని, భూ పరిరక్షణ కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ మేరకు సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ.. దండేపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 439లో మొత్తం 170 ఎకరాల 27 గుంటల ప్రభుత్వ భూమి ఉందని, 1992లో ఈ భూమిని 299 మంది నిరుపేదలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. భూమిలేని పేద కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న భూమిలో బీపీసీఎల్ కేంద్రం నిర్మాణానికి సన్నాహాలు చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

ఎన్నో ఏళ్లుగా ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న పేద కుటుంబాల భవిష్యత్తును ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. అభివృద్ధి పేరుతో పేదల జీవనాధారాన్ని దెబ్బతీయడం తగదని, ప్రస్తుతం భూములను సాగు చేసుకుంటున్న వారిని గుర్తించి అర్హులైన సాగుదారులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.

భూముల స్థితిగతులు, లబ్ధిదారుల హక్కులపై సమగ్ర విచారణ జరిపిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. బీపీసీఎల్ కేంద్రం నిర్మాణ సన్నాహాలను వెంటనే నిలిపివేసి, భూముల లబ్ధిదారులు, ప్రస్తుత సాగుదారులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పేదల భూముల పరిరక్షణ కోసం ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని మారుపాక అనిల్ కుమార్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కామెర లక్ష్మణ్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి నిమ్మల మనోహర్, భారతIMG-20261102-WA0025 కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కార్యదర్శి కర్రె లక్ష్మణ్, సీపీఐ మండల సహాయ కార్యదర్శి గడ్డం రాజనర్సు, రేణిగుంట్ల సాంబయ్య, గడ్డం సంధ్య, జాజాల సరోజన, జన్ను లింగయ్య, మారుపాక సంపత్, గడ్డం పూల, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ…  తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ… 
ఖమ్మం బ్యూరో , నవంబర్ - 02(తెలంగాణ ముచ్చట్లు ) వేసవి కాలం, ఎల్నినో ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, జిల్లాలోని అన్ని నివాస ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి...
వెంకటాద్రిపేటలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదు, పరిశీలన.
హుజూరాబాద్‌వాసికి డాక్టరేట్..!
జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.
గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకే పెద్దపీట.
రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి.
*నిబంధనలకు విరుద్ధంగా కార్తికేయ ఆసుపత్రి నిర్వహణ.. వెంటనే సీజ్ చేయాలి.