బీజేపీ పాలకవర్గ అవినీతిపై బండి సంజయ్‌ సమాధానం చెప్పాలి.

బీజేపీ పాలకవర్గ అవినీతిపై బండి సంజయ్‌ సమాధానం చెప్పాలి.

*రూ.100 కోట్ల నిధుల ఖర్చుపై సమగ్ర విచారణ జరిపించాలి:బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్.*

కరీంనగర్‌, నవంబర్‌ 2 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్‌ నగరపాలక సంస్థలో బీజేపీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లపై వస్తున్న అవినీతి ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్‌ సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం మంకమ్మతోటలోని మీకోసం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నగరంలో జనరల్‌ ఫండ్‌, యూఏడీఎఫ్‌ నిధులు కలిపి సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నా అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదన్నారు. నిధుల వినియోగం, పనుల కేటాయింపు, బిల్లుల చెల్లింపులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతోపాటు భవన నిర్మాణ అనుమతుల విషయంలోనూ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత ఎనిమిది నెలల 15 రోజుల్లో జారీ చేసిన అనుమతులపై విచారణ జరిపించాలని, కాంట్రాక్టర్లు, భవన యజమానులను విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. తమ వద్ద ఆడియో, వీడియో రికార్డులతోపాటు ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.

అవినీతి ఆరోపణలు నిజమైతే సంబంధిత కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారా? బ్లాక్‌లిస్టులో పెడతారా? అని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో మహాలక్ష్మి ఆలయంలో మీడియా సమక్షంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని, బండి సంజయ్‌ కూడా సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. ఆరోపణలను నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తానన్నారు. ఆధారాలు బయటపెట్టిన రోజు బండి సంజయ్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్‌ రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ అనూప్‌ కుమార్‌, డివిజన్‌ అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ…  తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ… 
ఖమ్మం బ్యూరో , నవంబర్ - 02(తెలంగాణ ముచ్చట్లు ) వేసవి కాలం, ఎల్నినో ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, జిల్లాలోని అన్ని నివాస ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి...
వెంకటాద్రిపేటలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదు, పరిశీలన.
హుజూరాబాద్‌వాసికి డాక్టరేట్..!
జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.
గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకే పెద్దపీట.
రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి.
*నిబంధనలకు విరుద్ధంగా కార్తికేయ ఆసుపత్రి నిర్వహణ.. వెంటనే సీజ్ చేయాలి.