హుజూరాబాద్‌వాసికి డాక్టరేట్..!

హుజూరాబాద్‌వాసికి డాక్టరేట్..!

 *ఏసిఎస్ఐఆర్ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్‌డీ పట్టా పొందిన యెదులాపురం రంజిత్ కుమార్*

హుజూరాబాద్,నవంబర్ 02(తెలంగాణ ముచ్చట్లు ):

పట్టణానికి చెందిన యెదులాపురం రంజిత్ కుమార్ ప్రతిష్ఠాత్మక డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) పట్టా సాధించి హుజూరాబాద్ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు యెదులాపురం రామబ్రహ్మం కుమారుడైన రంజిత్ కుమార్ ఇంజినీరింగ్ విభాగంలో ఉన్నత పరిశోధనలు పూర్తి చేసి ఈ అరుదైన విద్యా ఘనతను సొంతం చేసుకున్నారు.
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ (ఏసిఎస్ఐఆర్ ) సంస్థ నుంచి ఆయన ఈ డాక్టరేట్‌ను అందుకున్నారు. పరిశోధనా సంస్థల విభాగంలో ఎన్‌ఐఆర్‌ఎఫ్ (ఎన్ఐఆర్ఎఫ్ ) జాతీయ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో నిలిచిన ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో పీహెచ్‌డీ పొందడం విశేషం.
హైదరాబాద్‌లోని ప్రముఖ జాతీయ పరిశోధనా సంస్థ సిఎస్ఐఆర్ –ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సిఎస్ఐఆర్ -ఐఐసిటీ )లో యూజీసీ నెట్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జెఆర్ఎఫ్ ) సాధించి రంజిత్ కుమార్ తన డాక్టరల్ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. నానోస్ట్రక్చర్డ్ ఐరన్ ఆక్సైడ్లు, ఎంట్రోపీ ఇంజినీర్డ్ స్పినెల్ ఫెర్రైట్ల తయారీ, వాటి లక్షణాల విశ్లేషణతో పాటు అయస్కాంత లక్షణాలు, శక్తి నిల్వ (ఎనర్జీ స్టోరేజ్) రంగాల్లో వాటి వినియోగంపై ఆయన విస్తృతంగా పరిశోధనలు నిర్వహించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ…  తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ… 
ఖమ్మం బ్యూరో , నవంబర్ - 02(తెలంగాణ ముచ్చట్లు ) వేసవి కాలం, ఎల్నినో ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, జిల్లాలోని అన్ని నివాస ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి...
వెంకటాద్రిపేటలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదు, పరిశీలన.
హుజూరాబాద్‌వాసికి డాక్టరేట్..!
జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.
గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకే పెద్దపీట.
రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి.
*నిబంధనలకు విరుద్ధంగా కార్తికేయ ఆసుపత్రి నిర్వహణ.. వెంటనే సీజ్ చేయాలి.