వెంకటాద్రిపేటలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదు, పరిశీలన.
చిల్పూర్, నవంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు):*
ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్యల ఆదేశంతో మండలంలోని వెంకటాద్రిపేట గ్రామంలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమం జోరుగా సాగింది. ఓటు నమోదు, పరిశీలన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు, ఓటర్లు పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోడిశాల రవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అర్హత కలిగిన ఓటర్లందరూ తమ పేర్లను నమోదు చేసుకునేలా నాయకులు అవగాహన కల్పించారు. నమోదైన ఓట్లను పరిశీలించి, తప్పులు లేకుండా చూసుకున్నారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎన్నకూస కుమార్, చిల్పూర్ గుట్ట దేవస్థానం కమిటీ మెంబర్ గుడెల్లి అరుణ రమేష్ రెడ్డి, వార్డ్ మెంబర్ వడ్డేపల్లి పవన్, మంతెన లవన్, వెంకట్ రెడ్డి, రమణారెడ్డి, ప్రసాద్ రెడ్డి, పున్నం చందర్ రెడ్డి, రఘు, రత్నాకర్ పాల్గొన్నారు. ఓటర్లు హర్షవర్ధన్ రెడ్డి, నూనె దేవరాజు, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.


Comments