పాలమూరు రైతుల కన్నీళ్లకు కాంగ్రెస్ సర్కారే కారణం.

పాలమూరు రైతుల కన్నీళ్లకు కాంగ్రెస్ సర్కారే కారణం.

నీళ్లున్నా పంటలను ఎండబెట్టారు.. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

-- మాజీ మంత్రి హరీశ్ రావు

పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పాలమూరు ప్రాంతంలో రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిన కరువు కాదని, ప్రభుత్వ వైఫల్యంతోనే పంటలు ఎండిపోయాయని ఆరోపించారు.వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో సాగునీరు అందక ఎండిపోయిన వరి పంటలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఇతర పార్టీ నేతలతో కలిసి హరీశ్ రావు పరిశీలించారు. పంటలు ఎండిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం నిర్వహించిన రైతు సభలో ఆయన మాట్లాడుతూ.. ఒక్క అల్వాల గ్రామంలోనే సుమారు 250 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు.శ్రీశైలం ప్రాజెక్టుకు 221 టీఎంసీలు, జూరాల ప్రాజెక్టుకు 252 టీఎంసీల నీరు వచ్చినా సకాలంలో మోటార్లు నడపక రైతులకు సాగునీరు అందించలేదని ఆరోపించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఐదు మోటార్లను 24 గంటలు నడిపితే మరిన్ని ఎకరాలకు నీరందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. కళ్లముందే కృష్ణా జలాలు పారుతున్నా పాలమూరు పొలాలకు నీరు అందకపోవడం బాధాకరమన్నారు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించి రిజర్వాయర్లకు నీటిని తరలించాలని డిమాండ్ చేశారు. జూరాల నుంచి మరో 15 రోజుల పాటు నీటిని విడుదల చేసి చేతికొచ్చే దశలో ఉన్న పంటలను కాపాడాలని కోరారు.రైతుల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించిన హరీశ్ రావు, ఎండిపోయిన పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, యాసంగి రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు కూలీలకు ప్రకటించిన రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనిదినాలు పెంచాలని కోరారు.తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని పంపించి రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు అధైర్యపడవద్దని, వారి సమస్యలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసి రైతుల పక్షాన పోరాడతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, సి. లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.IMG-20261102-WA0039

Tags:

Post Your Comments

Comments

Latest News

తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ…  తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ… 
ఖమ్మం బ్యూరో , నవంబర్ - 02(తెలంగాణ ముచ్చట్లు ) వేసవి కాలం, ఎల్నినో ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, జిల్లాలోని అన్ని నివాస ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి...
వెంకటాద్రిపేటలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదు, పరిశీలన.
హుజూరాబాద్‌వాసికి డాక్టరేట్..!
జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.
గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకే పెద్దపీట.
రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి.
*నిబంధనలకు విరుద్ధంగా కార్తికేయ ఆసుపత్రి నిర్వహణ.. వెంటనే సీజ్ చేయాలి.