అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి.
వంగాలపల్లి,నష్కల్ గ్రామాల ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ ఆరూరి పవన్.
వంగాలపల్లి,నవంబర్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని వంగాలపల్లి, నష్కల్ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి ఆరూరి పవన్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వంగాలపల్లి, నష్కల్ గ్రామాల్లోని అర్హులైన పట్టభద్రులందరూ ఓటరు నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ముఖ్యంగా యువత, నిరుద్యోగ పట్టభద్రులు ఓటరు నమోదుపై నిర్లక్ష్యం చేయకుండా తమ ఓటు హక్కును పొందాలని సూచించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో కృషి చేయాలని ఆరూరి పవన్ పిలుపునిచ్చారు.


Comments