వెల్టూర్‌లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ.. ఆందోళనలో రైతులు.

వెల్టూర్‌లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ.. ఆందోళనలో రైతులు.

పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లను దొంగలించడమే కాకుండా, వాటిలో ఉండే విలువైన పరికరాలను సైతం అపహరించినట్లు రైతులు తెలిపారు.ప్రస్తుతం పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురికావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడుతోందని, పంటలను కాపాడుకోవడం కష్టంగా మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి చోరీకి గురైన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. అలాగే ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ…  తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ… 
ఖమ్మం బ్యూరో , నవంబర్ - 02(తెలంగాణ ముచ్చట్లు ) వేసవి కాలం, ఎల్నినో ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, జిల్లాలోని అన్ని నివాస ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి...
వెంకటాద్రిపేటలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదు, పరిశీలన.
హుజూరాబాద్‌వాసికి డాక్టరేట్..!
జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.
గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకే పెద్దపీట.
రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి.
*నిబంధనలకు విరుద్ధంగా కార్తికేయ ఆసుపత్రి నిర్వహణ.. వెంటనే సీజ్ చేయాలి.