గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకే పెద్దపీట.

గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకే పెద్దపీట.

ఘన్‌పూర్‌లో గ్రామ ఆరోగ్య, పోషకాహార దినోత్సవం

పాల్గొన్న 17వ వార్డు కౌన్సిలర్ పొన్నం స్వరూప రాజయ్య

స్టేషన్ ఘన్‌పూర్, నవంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు): 

తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా స్టేషన్ ఘన్‌పూర్‌లోని ఒకటవ కేంద్రంలో గ్రామ ఆరోగ్య, పోషకాహార దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ పొన్నం స్వరూప రాజయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. తల్లులు, చిన్నారుల పోషకాహార స్థితిని పరిశీలించి, రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మాతాశిశు మరణాలను తగ్గించేందుకు గర్భిణులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, చిన్నారుల శారీరక ఎదుగుదల, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై తల్లులకు అవగాహన కల్పించారు. తల్లీబిడ్డల సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారంతో పాటు సకాలంలో వైద్య సేవలు పొందడం ఎంతో అవసరమని వివరించారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు మారేడుపాక లిఖిత భవాని, సహాయకురాలు తాటికొండ బుచ్చమ్మతో పాటు మాచర్ల కోమల, నక్క సుహాసిని, ఈగ సోని, కడమంచి జ్యోతి, గుండె వేణు, గుండె మరియా తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ…  తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ… 
ఖమ్మం బ్యూరో , నవంబర్ - 02(తెలంగాణ ముచ్చట్లు ) వేసవి కాలం, ఎల్నినో ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, జిల్లాలోని అన్ని నివాస ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి...
వెంకటాద్రిపేటలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదు, పరిశీలన.
హుజూరాబాద్‌వాసికి డాక్టరేట్..!
జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.
గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకే పెద్దపీట.
రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి.
*నిబంధనలకు విరుద్ధంగా కార్తికేయ ఆసుపత్రి నిర్వహణ.. వెంటనే సీజ్ చేయాలి.