ధాన్యం కుప్పకు బలైన నిండు ప్రాణం.

ధాన్యం కుప్పకు బలైన నిండు ప్రాణం.

- రోడ్డుపై ఆరబోసిన ధాన్యాన్ని ఢీకొని వ్యక్తి మృతి.
- ధాన్యం యజమానులదే పూర్తి బాధ్యత: సీఐ తుమ్మలపల్లి శ్రీహరి.

సత్తుపల్లి, నవంబరు 2(తెలంగాణ ముచ్చట్లు):

ప్రభుత్వ రహదారులపై వరి ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సత్తుపల్లి సీఐ తుమ్మలపల్లి శ్రీహరి హెచ్చరించారు. ఈ నెల ఒకటో తేదీన సదాశివునిపాలెం గ్రామంలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కారణంగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. సదాశివునిపాలెం గ్రామానికి చెందిన గాయం రాము, చాట్ల లక్ష్మి అనే ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ రహదారిపై వరి ధాన్యం ఆరబోశారు. అదే సమయంలో తుంబూరు గ్రామానికి చెందిన తురకా రాంబాబు ద్విచక్రవాహనంపై అటుగా వెళ్తూ ధాన్యం కుప్పను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వాహనంపై నుంచి రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు రోడ్డుపై ధాన్యం ఆరబోసి ప్రమాదానికి కారణమైన గాయం రాము, చాట్ల లక్ష్మిపై సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సీఐ తుమ్మలపల్లి శ్రీహరి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు. కొందరు రైతులు ప్రభుత్వ రహదారులపై ధాన్యం ఆరబోయడమే కాకుండా, వాహనాలు ధాన్యం కుప్పలపైకి రాకుండా రోడ్లపై పెద్ద పెద్ద రాళ్లు, ముళ్ల కంచెలు, కట్టెలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇకపై రహదారులపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమైతే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. ఇలాంటి ప్రమాదాలకు ధాన్యం యజమానులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రైతులు తమ పంటను ప్రభుత్వ రహదారులపై కాకుండా ప్రభుత్వం కేటాయించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు (పీపీసీలు) లేదా గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ కల్లాల్లో మాత్రమే ఆరబెట్టుకోవాలని సత్తుపల్లి సీఐ తుమ్మలపల్లి శ్రీహరి విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ…  తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ… 
ఖమ్మం బ్యూరో , నవంబర్ - 02(తెలంగాణ ముచ్చట్లు ) వేసవి కాలం, ఎల్నినో ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, జిల్లాలోని అన్ని నివాస ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి...
వెంకటాద్రిపేటలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదు, పరిశీలన.
హుజూరాబాద్‌వాసికి డాక్టరేట్..!
జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.
గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకే పెద్దపీట.
రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి.
*నిబంధనలకు విరుద్ధంగా కార్తికేయ ఆసుపత్రి నిర్వహణ.. వెంటనే సీజ్ చేయాలి.