పౌష్టికాహారంతోనే శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదల.

అంగన్వాడీ సూపర్వైజర్ వసంతారాణి.

పౌష్టికాహారంతోనే శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదల.

పెద్దమందడి,నవంబర్03(తెలంగాణ ముచ్చట్లు):

చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని అంగన్వాడీ సూపర్వైజర్ వసంతారాణి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం 1,2లో నిర్వహించిన అన్నప్రాసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు తల్లికి అంగన్వాడీ కేంద్రం ద్వారా పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. బిడ్డకు ఆరు నెలలు పూర్తయిన తర్వాత అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించి, అప్పటి నుంచి చిన్నారులకు బాలామృతంతో పాటు నెలకు 16 గుడ్లు అందజేస్తామని వివరించారు. తల్లులు చిన్నారుల ఆహారం, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని గర్భిణులు, బాలింతలకు సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, సునీత, గర్భిణులు,, చిన్నారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News