టైలర్ కోట రవికి ఫ్రెండ్స్ ఫౌండేషన్ (ఎఫ్2) సభ్యుల ఘన నివాళి.

టైలర్ కోట రవికి ఫ్రెండ్స్ ఫౌండేషన్ (ఎఫ్2) సభ్యుల ఘన నివాళి.

ఖమ్మం బ్యూరో , నవంబర్ 3(తెలంగాణ ముచ్చట్లు )

 అనారోగ్యంతో అక్టోబర్ 23న మృతి చెందిన టైలర్ కోట రవికి ఫ్రెండ్స్ ఫౌండేషన్ (ఎఫ్2) సభ్యులు ఘన నివాళులర్పించారు. నవంబర్ 3న రవి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రవి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఫ్రెండ్స్ ఫౌండేషన్ (ఎఫ్2) తరఫున కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో కె.వి. నరసింహారావు, బి. శంకరాచారి, ఎం.డి. కరీముల్లా, వి. పాపారావు, బి. రామారావు, ఎస్.కె. పెంటు సాహెబ్, కె. రాము, వి. వెంకటేశ్వర్లు, సమ్మయ్య, ఎం. వీరన్న, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News