విద్యార్థుల ఆరోగ్యానికి అల్పాహార పథకం దోహదం.

విద్యార్థుల ఆరోగ్యానికి అల్పాహార పథకం దోహదం.

*పోషకాహారంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, చదువుపై ఆసక్తి పెరుగుతాయి: ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి.*

మానకొండూర్, నవంబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):

మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహార పథకంలో భాగంగా హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్పాహార పంపిణీ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.

విద్యార్థులకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ద్వారా హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల హాజరు పెరగడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడటం, చదువుపై ఆసక్తి పెరగడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఈ సందర్భంగా డా. కవ్వంపల్లి సత్యనారాయణ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అల్పాహార పంపిణీని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా పురోగతి, ఆరోగ్యం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పిల్లలు ఖాళీ కడుపుతో పాఠశాలకు రాకుండా పోషకాహారం అందించడం వల్ల వారిలో ఏకాగ్రత, క్రమశిక్షణ మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అల్పాహార పథకం నియోజకవర్గంలోని విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.IMG-20261103-WA0257

Tags:

Post Your Comments

Comments

Latest News