మండల సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహణ.
వేలేరు, నవంబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
హన్మకొండ జిల్లా, వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని గ్రామాల్లో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ కోమి మాట్లాడుతూ మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు సకాలంలో అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.
అనంతరం వివిధ శాఖల అధికారులు తమ తమ శాఖల పరిధిలో గ్రామాల్లో చేపడుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి సమావేశంలో వివరించారు. గ్రామాల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో చర్చించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మండలంలోని సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


Comments