తెలంగాణ లో అధికారంపై బీజేపీవి పగటి కలలు.

తెలంగాణ లో అధికారంపై బీజేపీవి పగటి కలలు.

IMG-20261103-WA0242* కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను  ఖండించిన మంత్రి పొంగులేటి

* కాళేశ్వరం అక్రమాలపై  ఆధారాలతో ఫిర్యాదు చేసి ఏడాదవుతున్నా చర్యలు కరువు 

* బిజెపి, బీఆర్ఎస్ దొందూ దొందే..

* దమ్మాయిగూడెంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ 

ఖమ్మం బ్యూరో, నవంబర్ 3(తెలంగాణ ముచ్చట్లు )

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బిజెపి పాగా వేస్తుందని కేంద్ర మంత్రి అమీత్ షా, ఆ పార్టీ పెద్దలు పగటి కలలు కంటున్నారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. మంగళవారం దమ్మాయిగూడెం గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను 187 మందికి అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎన్నికల సంఘాన్ని తొత్తుగా మార్చుకొని.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్) పేరిట.. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించిందని, ఆ పార్టీని ఇక్కడి ప్రజలు నమ్మబోరని అన్నారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి ఆర్ఆర్ టాక్స్ వెళ్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శలు చేయడం అర్థరహితమన్నారు. గతంలో తొమ్మిదన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. బిజెపి, బీఆర్ఎస్ దొందూ దొందేనని విమర్శించారు. ఒకరు కొట్టినట్లు.. మరొకరు ఏడ్చినట్లు నటిస్తూ.. ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.  ఓట్లు రక్షించాల్సిన కేంద్రం భక్షించిందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని, దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని  మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. దేశవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసి,  అర్హులైన పేదల సొంతింటి కలను సాకారం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, ఆత్మ కమిటీ పాలేరు నియోజకవర్గ చైర్మన్ చావా శివరామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండIMG-20261103-WA0242ల అధ్యక్షుడు కొప్పుల అశోక్, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.మసహాయం నరేష్ రెడ్డి, ఆత్మ కమిటీ పాలేరు నియోజకవర్గ చైర్మన్ చావా శివరామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొప్పుల అశోక్, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News