అభివృద్ధి పనులకు మేయర్ శ్రీకారం.

అభివృద్ధి పనులకు మేయర్ శ్రీకారం.

*రూ.1.15 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులకు శ్రీకారం.*

*నగరాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం: మేయర్ కొలగాని శ్రీనివాస్.*

కరీంనగర్, నవంబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):

నగర అభివృద్ధే ధ్యేయంగా, పారదర్శక పాలనతో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు తమ పాలకవర్గం కృషి చేస్తోందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం 3, 5వ డివిజన్లలో పర్యటించి రూ.1.15 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

3వ డివిజన్ తీగలగుట్టపల్లిలో స్థానిక కార్పొరేటర్ సాధినేని లావణ్య మునీందర్‌తో కలిసి నగరపాలక సంస్థ సాధారణ నిధులు రూ.38 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.

అనంతరం 5వ డివిజన్ సిటిజన్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ గాదె రూప శ్రీనివాస్‌తో కలిసి రెండు ప్రాంతాల్లో యూఐడీఎఫ్ నిధులు రూ.77 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని మేయర్ ఇంజినీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News