పీచరలో గాంధీ విగ్రహానికి రక్షణ కరువు.. ప్రమాదం పొంచి ఉందంటున్న గ్రామస్తులు.
Views: 0
On
వేలేరు, నవంబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో గాంధీ విగ్రహానికి రక్షణ లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం చుట్టూ కంచె, రక్షణ గోడ లేకపోవడంతో పలువురు విగ్రహం వద్ద కూర్చుంటున్నారని, దీంతో విగ్రహానికి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి గాంధీ విగ్రహం చుట్టూ రక్షణ గోడ నిర్మించి, కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహ గౌరవాన్ని, భద్రతను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 Nov 2026 21:23:15
ఖమ్మం బ్యూరో , నవంబర్ 3(తెలంగాణ ముచ్చట్లు )
అనారోగ్యంతో అక్టోబర్ 23న మృతి చెందిన టైలర్ కోట రవికి ఫ్రెండ్స్ ఫౌండేషన్ (ఎఫ్2) సభ్యులు ఘన...


Comments