నిఘా వ్యవస్థ నిర్వీర్యం.. పట్టించుకోని అధికారులు!

నిఘా వ్యవస్థ నిర్వీర్యం.. పట్టించుకోని అధికారులు!

వేలేరు, నవంబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నిఘా వ్యవస్థ నిర్వీర్యంగా మారుతోంది. గ్రామాల్లో నేరాలను అరికట్టడంతో పాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మరమ్మతులకు గురై నిరుపయోగంగా మారుతున్నాయి.
ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఏదైనా దొంగతనం లేదా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు నిందితులను గుర్తించడం పోలీసులకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణపై అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలోని అన్ని గ్రామాల్లో పనిచేయని సీసీ కెమెరాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేయించాలని, నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.IMG-20261103-WA0261

Tags:

Post Your Comments

Comments

Latest News