ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.

ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.

*రైతుల సంక్షేమం, మెరుగైన మార్కెట్ సౌకర్యాలే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి.*

మానకొండూర్, నవంబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):

మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లంతకుంట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన అంతగిరి సాహిత్య వినయ్ కుమార్, వైస్ ఛైర్మన్‌గా నియమితులైన గుండ్రెడ్డి భరత్ రెడ్డితో పాటు నూతన డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలను స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇల్లంతకుంట మండల రైతాంగానికి మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించడంతో పాటు రైతులు పండించిన పంటలకు న్యాయమైన ధరలు లభించేలా కృషి చేయాలని సూచించారు. రైతులకు అవసరమైన సేవలు అందిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా నూతన పాలకవర్గం నిబద్ధతతో పనిచేయాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News