ఉద్యోగుల నిస్వార్థ సేవలే సమాజానికి ఆదర్శం.
* రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
* ఉద్యోగ విరమణ చేసిన విద్యుత్ శాఖ లైన్ ఇన్ స్పెక్టర్ గడ్డికొప్పుల రాములుకు సత్కారం
ఖమ్మం బ్యూరో, నవంబర్ 3(తెలంగాణ ముచ్చట్లు )
ఉద్యోగుల నిస్వార్థ సేవలే సమాజానికి ఆదర్శమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత తండ్రి విద్యుత్ శాఖలో లైన్ ఇన్ స్పెక్టర్ గా ఉద్యోగ విరమణ చేసిన గడ్డికొప్పుల రాములు ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాములును, వారి కుటుంబ సభ్యులను మంత్రి శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..విద్యుత్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు, రైతులకు విశేష సేవలందించి రాములు ఉద్యోగ విరమణ పొందారన్నారు. ఉద్యోగంలో చేరినప్పుడే విరమణ తేదీ ఖరారవుతుందని, అయితే, సర్వీసులో ఉన్నంత కాలం ప్రజలకు, రైతులకు మనం అందించిన సేవలే ఉద్యోగ విరమణ తర్వాత కూడా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. రాములు విద్యుత్ శాఖలో పనిచేసిన కాలంలో అందించిన సేవలు, చేసిన మంచి పనుల వల్లే ఈరోజు వర్షం పడుతున్నప్పటికీ వందలాది మంది రైతులు, ప్రజలు ఆత్మీయంగా తరలివచ్చారన్నారు. ఉద్యోగి సేవా కాలం ముగిసిన తర్వాత కూడా ప్రజలు వారిని గుర్తుపెట్టుకోవడమే అసలైన విజయమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments