బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.

రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి: ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ.

బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.

మానకొండూర్, నవంబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు):

మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండల కేంద్రంలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన చైర్మన్ మాతంగి శిరీష అనిల్, వైస్ చైర్మన్ పర్శ సంతోష్‌తో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే నూతన పాలకవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా డా. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నూతన పాలకవర్గం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించడం, పంటల అభివృద్ధికి కృషి చేయడం, రైతులకు పంటలకు న్యాయమైన ధరలు లభించేలా చూడటం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీ పారదర్శకంగా పనిచేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, గ్రామీణ ప్రాంత రైతులకు మరింత చేరువగా సేవలు అందించాలని కోరారు.

నూతన చైర్మన్ మాతంగి శిరీష అనిల్, వైస్ చైర్మన్ పర్శ సంతోష్‌తో పాటు డైరెక్టర్లు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
పెద్దమందడి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని గ్రామ ప్రజలు, పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల...
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.
మీ ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి అభినందనీయం.
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.
మద్దిగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక.