ప్రకటనలు ఘనం.. ఖాతాల్లో నగదు శూన్యం! రైతు భరోసాపై రైతుల ఆవేదన!*

ప్రకటనలు ఘనం.. ఖాతాల్లో నగదు శూన్యం! రైతు భరోసాపై రైతుల ఆవేదన!*

-మెసేజ్‌లు పంపి రైతులను అయోమయానికి గురిచేయడం సరికాదు.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి – హింగే భాస్కర్

ఎల్కతుర్తి, నవంబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు):

రైతు భరోసా పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసినట్లు ముఖ్యమంత్రి పేరుతో సందేశాలు పంపిస్తూ, వాస్తవంగా ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడం రైతులను తీవ్ర అయోమయానికి గురిచేస్తోందని తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.

బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో పలువురు రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో సందేశాలు వచ్చాయని తెలిపారు. రైతు భరోసా పథకం కింద రూ.11,850 తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు సందేశాల్లో పేర్కొన్నప్పటికీ, బ్యాంకు ఖాతాలను పరిశీలించగా నగదు జమ కాలేదని రైతులు వాపోతున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి పేరుతో అధికారికంగా నగదు జమ అయినట్లు సందేశాలు పంపినప్పుడు, ఆ మొత్తాలు రైతుల ఖాతాల్లో వాస్తవంగా జమ కావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేవలం సందేశాలు పంపి రైతులకు భరోసా కల్పించినట్లు ప్రచారం చేసుకోవడం సరికాదని విమర్శించారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ఖాతాల్లో నగదు ఎందుకు జమ కాలేదో స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సందేశాలు అందుకున్న రైతులందరికీ తక్షణమే రైతు భరోసా నిధులు జమ చేయాలని, సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.

రైతులకు ప్రకటనలు కాదు.. ఆర్థిక భరోసా కావాలి. సందేశాల్లో కనిపించే రైతు భరోసా బ్యాంకు ఖాతాల్లోనూ కనిపించాలి అని హింగే భాస్కర్ పేర్కొన్నారు.

ఈ విషయంపై ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి తరఫున డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
పెద్దమందడి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని గ్రామ ప్రజలు, పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల...
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.
మీ ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి అభినందనీయం.
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.
మద్దిగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక.