సగర ఆత్మగౌరవ భవనానికి రూ.2 కోట్ల నిధులు మంజూరు హర్షణీయం.

వనపర్తి జిల్లా సగర సంఘం అధ్యక్షుడు మేడల తిరుపతయ్య సగర.

సగర ఆత్మగౌరవ భవనానికి రూ.2 కోట్ల నిధులు మంజూరు హర్షణీయం.

వనపర్,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు):

హైదరాబాద్ కోకాపేటలో నిర్మించనున్న సగర ఆత్మగౌరవ భవనానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షణీయమని వనపర్తి జిల్లా సగర సంఘం అధ్యక్షుడు మేడల తిరుపతయ్య సగర అన్నారు. గురువారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, సగర ఫెడరేషన్ ఎండీ బాలమాయాదేవి చేతుల మీదుగా నిధుల మంజూరు పత్రాన్ని రాష్ట్ర సగర సంఘం నాయకులు అందుకున్నారని తెలిపారు.ఈ సందర్భంగా తిరుపతయ్య సగర మాట్లాడుతూ.. సగరుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ భవన నిర్మాణానికి రూ.2 కోట్లు సరిపోవని, ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు. నిర్మాణ రంగం సగరుల సంప్రదాయ వృత్తి కావడంతో భవన నిర్మాణ బాధ్యతలను సగర సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్లకే అప్పగించాలని రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.ఈ విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం సంతోషకరమన్నారు.సగరుల ఐక్యత, అభివృద్ధి, ఆత్మగౌరవానికి ఈ భవనం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, గౌరవాధ్యక్షుడు ముత్యాల హరికిషన్ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, వివిధ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, మహిళా సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
పెద్దమందడి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని గ్రామ ప్రజలు, పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల...
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.
మీ ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి అభినందనీయం.
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.
మద్దిగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక.