ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.

నూతన కమిటీ సభ్యులు.

ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.

పెద్దమందడి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని గ్రామ ప్రజలు, పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమపై నమ్మకంతో ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించిన గ్రామ ప్రజలకు నూతన కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన ఆలయ చైర్మన్ చాపల శివరెడ్డి మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, ఆలయ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలు, ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఆలయ అభివృద్ధితో పాటు గ్రామంలో ఐక్యత, ఆధ్యాత్మిక భావన పెంపొందించేలా కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. తమకు ఈ బాధ్యత అప్పగించిన ప్రతి ఒక్కరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులోనూ గ్రామ ప్రజల సహకారం, సూచనలు కోరుతున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భీమదేవరపల్లి మండల కేంద్రంలో అల్పాహార పథకం ప్రారంభం. భీమదేవరపల్లి మండల కేంద్రంలో అల్పాహార పథకం ప్రారంభం.
భీమదేవరపల్లి, నవంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించేందుకు చేపట్టిన పథకాన్ని భీమదేవరపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్...
ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.
మీ ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి అభినందనీయం.
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.