శ్రీ ముఖ్యనాథస్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ.

శ్రీ ముఖ్యనాథస్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ.

ఈ నెల 16న ప్రత్యేక పూజలు, రుద్రహోమాలు, స్వామివారి కల్యాణ మహోత్సవం

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి 

ఆలయ పునఃవ్యవస్థాపకులు శివసాని ప్రవీణ్ రవీంద్ర

ధర్మసాగర్,నవంబర్04 (తెలంగాణ ముచ్చట్లు):

కాకతీయుల కాలం నాటి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ముప్పారం గ్రామంలోని శ్రీ ముఖ్యనాథస్వామి దేవాలయాన్ని శిథిలావస్థ నుంచి పునరుద్ధరించి, పరివార దేవతలతో సహా స్వామివారి పునఃప్రాణ ప్రతిష్ఠ నిర్వహించి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయ తృతీయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ఆలయ ప్రాంగణంలో వార్షికోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీవీకే కన్సల్టెన్సీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వినోద్ కుమార్, ప్రాంతీయ సంచాలకులు గీత రాజేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ పునఃవ్యవస్థాపకులు శివసాని ప్రవీణ్ రవీంద్ర మాట్లాడుతూ.. ఈ నెల 16వ తేదీ సోమవారం నిర్వహించనున్న శ్రీ ముఖ్యనాథస్వామి తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రహోమాలు, స్వామివారి కల్యాణ మహోత్సవం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావడంతో పాటు వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శి ఆకారపు సురేష్, గౌరవ సలహాదారులు గొట్టిముక్కుల సురేష్ కుమార్, కాశీరెడ్డి రాజిరెడ్డి, అధ్యక్షులు కొన్నె రవీందర్ రెడ్డి, కమిటీ సభ్యులు గూల్ల కొమురయ్య, మర్రిపల్లి రాజు, యాటల శివ, గుంటిపల్లి సంపత్, సులుగూరి భిక్షపతి, ఏతిరాజుల యాదగిరి, సిద్ధెంకి సాయిలు, వేములకొండ భిక్షపతి, రవి, అంబీర్ రవి, బోడ ఐలయ్య, చిట్యాల రాజేష్, బండి వెంకన్న, పరకాల ఇస్తారి, గుంటిపల్లి నగేష్, కందుకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
పెద్దమందడి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని గ్రామ ప్రజలు, పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల...
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.
మీ ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి అభినందనీయం.
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.
మద్దిగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక.