మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి .

మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి .

వనపర్తి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు):

గ్రామీణ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి, ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మహిళలకు నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చేసిన కృషి ఫలితంగా 36 మంది మహిళలకు ఉద్యోగాలు లభించాయి. ఎంపికైన వారికి నెలకు కనీసం రూ.20 వేల వేతనంతో పాటు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే మేఘారెడ్డి సహకారంతో, నాబార్డు ఆర్థిక తోడ్పాటుతో వనపర్తి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్టోబర్ 3 నుంచి 28 వరకు 60 మంది మహిళలకు 20 రోజుల పాటు నవజాత శిశువుల సంరక్షణ, బాలింతల ఆరోగ్య పరిరక్షణ, తల్లీబిడ్డల సంరక్షణ, గృహ వంటకాలు తదితర అంశాల్లో శిక్షణ అందించారు. వైద్య కళాశాల నిపుణుల బోధనతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయి శిక్షణ కల్పించారు.శిక్షణ అనంతరం ఉద్యోగాలు కల్పించేందుకు శిక్షణ సంస్థ సంచాలకుడు బి. అనిల్ కుమార్ హైదరాబాద్‌కు చెందిన పోర్టియా వైద్య సేవల సంస్థతో అనుసంధానం ఏర్పాటు చేశారు. దీంతో శిక్షణ పూర్తి చేసుకున్న 60 మందిలో 36 మంది మహిళలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.తాజాగా గురువారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్వయంగా ఎంపికైన మహిళలకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. మహిళలు ఎవరి మీదా ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో జీవించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఒక మహిళ ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందని అన్నారు.గత నెల 26న జరిగిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి మనోహర్ రెడ్డి పాల్గొని ధ్రువపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి రమేష్, వైస్ చైర్‌పర్సన్ మధుసూదన్ గౌడ్, పోర్టియా ప్రాంతీయ నిర్వాహకుడు శ్రీకాంత్, శిక్షణ సంస్థ సంచాలకుడు బి. అనిల్ కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు సంచాలకురాలు ఉమాదేవి, జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి రామ మహేశ్వర్ రెడ్డి, ఆధిక్య బ్యాంకు జిల్లా నిర్వాహకుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భీమదేవరపల్లి మండల కేంద్రంలో అల్పాహార పథకం ప్రారంభం. భీమదేవరపల్లి మండల కేంద్రంలో అల్పాహార పథకం ప్రారంభం.
భీమదేవరపల్లి, నవంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించేందుకు చేపట్టిన పథకాన్ని భీమదేవరపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్...
ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.
మీ ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి అభినందనీయం.
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.