*శాతవాహన యూనివర్సిటీలో సీపీజీఈటీ స్పాట్ అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలి.
*ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలి.. గ్రామీణ విద్యార్థులకు న్యాయం చేయాలి.*
*ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసల విష్ణు డిమాండ్.*
కరీంనగర్, నవంబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు):
శాతవాహన విశ్వవిద్యాలయంలో సీపీజీఈటీ–2026 స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసల విష్ణు డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) శాతవాహన విశ్వవిద్యాలయ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు వైస్ ఛాన్సలర్‌కు వినతిపత్రం అందజేశారు.
సీపీజీఈటీ–2026 మొదటి, రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయినప్పటికీ విశ్వవిద్యాలయ పరిధిలోని పలు కోర్సుల్లో వందలాది సీట్లు ఖాళీగా మిగిలిపోయాయని విష్ణు తెలిపారు. యూనివర్సిటీ క్యాంపస్‌తో పాటు అనుబంధ కళాశాలల్లోనూ సీట్లు ఖాళీగా ఉండటంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో అధిక ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని శాతవాహన విశ్వవిద్యాలయ అధికారులు వెంటనే స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేసి, ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు నితిన్, రోహిత్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.


Comments