జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు గంగారపు ప్రభుదేవ్ ఎంపిక!

రాష్ట్రస్థాయి 400 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానం కైవసం.

జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు గంగారపు ప్రభుదేవ్ ఎంపిక!

ఖమ్మం, నవంబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు):

పరుగుపందెంలో అద్భుత ప్రతిభ కనబరిచి గంగారపు ప్రభుదేవ్ జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు. ఖమ్మంలోని పోలీస్ పరేడ్ మైదానంలో బుధవారం నిర్వహించిన భారత పాఠశాలల క్రీడా సమాఖ్య రాష్ట్రస్థాయి అండర్‌-17 బాలుర 400 మీటర్ల పరుగుపందెంలో ప్రభుదేవ్ ప్రథమ స్థానం సాధించి సత్తా చాటాడు.ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు గంగారపు శ్రీనివాస్ కుమారుడైన ప్రభుదేవ్ తన అసాధారణ ప్రతిభతో ప్రత్యర్థులను అధిగమించి మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విజయంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురిలో ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయస్థాయి పాఠశాలల అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు.

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల కుటుంబ సభ్యులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయస్థాయిలోనూ ఇదే ప్రతిభను కొనసాగించి పతకం సాధించాలని, రాష్ట్రానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు.చిన్న వయసులోనే క్రీడారంగంలో ప్రతిభ చాటుతున్న ప్రభుదేవ్ మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.IMG-20261104-WA0048

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
పెద్దమందడి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని గ్రామ ప్రజలు, పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల...
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.
మీ ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి అభినందనీయం.
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.
మద్దిగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక.