ఘనంగా ఎండీ అశ్రీఫ్ భాయ్ జన్మదిన వేడుకలు.
ఖమ్మం బ్యూరో, నవంబర్ 4(తెలంగాణ ముచ్చట్లు )
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీరాభిమాని, తుమ్మల యుగేందర్ ముఖ్య అనుచరుడు ఎండీ అశ్రీఫ్ భాయ్ జన్మదిన వేడుకలను బుధవారం ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఖమ్మం బస్ డిపో రోడ్డులోని హాట్ స్పాట్ కాఫీ కేఫ్ వద్ద 44వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు గుడిపూడి జగదీష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎండీ అశ్రీఫ్ భాయ్‌కు పూల బొకే అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం శాలువాలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 47వ డివిజన్ నాయకులు నాళం సతీష్, షాదీఖానా చైర్మన్ షేక్ ఖదీర్ భాయ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ లతీఫ్, 44వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాచర్ల తిరుమలరావు, మైనారిటీ నాయకులు షేక్ హుసేన్ తదితరులు హాజరై అశ్రీఫ్ భాయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఎండీ అశ్రీఫ్ భాయ్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నాయకులు, అభిమానులు ఆకాంక్షించారు.


Comments