పేదల సేవే లక్ష్యంగా పల్లా జాన్ రాములు సేవా స్ఫూర్తి.

పేదల సేవే లక్ష్యంగా పల్లా జాన్ రాములు సేవా స్ఫూర్తి.

88వ జయంతి సందర్భంగా ఉచిత వైద్య, కంటి వైద్య శిబిరం.. 1000 మందికి పైగా నిరుపేదలకు వైద్య సేవలు

ఖమ్మం బ్యూరో, నవంబర్ 4(తెలంగాణ ముచ్చట్లు )

పేదల పక్షపాతిగా, పీడిత ప్రజల గొంతుకగా, జీవితాంతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు స్వర్గీయ పల్లా జాన్ రాములు 88వ జయంతి సందర్భంగా ఆయన సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ కుమారుడు, ప్రముఖ సమాజ సేవకుడు పల్లా కిరణ్ ఆధ్వర్యంలో ఖమ్మం మిషన్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉచిత జనరల్ వైద్య శిబిరం, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. డోర్నకల్ బిషప్. రెవ. డా. కె. సేనం రాజు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాలను ప్రారంభించారు.

ఈ వైద్య శిబిరానికి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిరుపేదలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 1000 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా 300 మందికి పైగా అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడంతో కార్యక్రమం విజయవంతమైంది.

ఈ సందర్భంగా బిషప్ కె. సేనం రాజు మాట్లాడుతూ స్వర్గీయ పల్లా జాన్ రాములు చేసిన ప్రజాసేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ పల్లా కిరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. కార్యక్రమంలో రెవ. డాక్టర్ విశ్వం, జి. ప్రభాకర్ రావు, రెవ. బి. శ్రీనివాస్ పాల్, రెవ. ఇశ్రాయేల్ రెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఎల్లయ్య, చిలకబత్తిని కనకయ్య తదితరులు పాల్గొని పల్లా కిరణ్‌ను ఆశీర్వదించారు.

వైద్య సేవలు అందించిన డాక్టర్లు రఘు, సృజన్, రాజ్ కుమార్, హరికృష్ణతో పాటు గంట కిరణ్, పల్లా కిరణ్ యూత్ సభ్యులు శిబిరం విజయవంతానికి కృషి చేశారు.

IMG-20261104-WA0027

ఈ సందర్భంగా పల్లా కిరణ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం రెండుసార్లు ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కరోనా సమయంలో 3,000 మందికి మామిడికాయ పచ్చడి పంపిణీ చేయడంతో పాటు ప్రైవేటు ఉపాధ్యాయులు, పేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందించినట్లు వివరించారు.

వరదల సమయంలో బాధితులకు ఆహారం, తాగునీరు, నిత్యావసర సరుకులు, దుస్తులు పంపిణీ చేశామని తెలిపారు. పేద విద్యార్థుల ప్రాథమిక, ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సొంత ఖర్చులతో బోర్లు వేయించడం, ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, అనాథ బాలబాలికలు, యువతకు నిరంతరం అండగా ఉంటూ సేవలు అందించడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని పల్లా కిరణ్ పేర్కొన్నారు. తన తండ్రి పల్లా జాన్ రాములు చూపిన సేవా మార్గంలో పయనిస్తూ భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
పెద్దమందడి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని గ్రామ ప్రజలు, పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల...
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.
మీ ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి అభినందనీయం.
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.
మద్దిగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక.