హుజూరాబాద్ 5వ వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరం.
*ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కౌన్సిలర్ సొళ్ళు సునీత సేవా కార్యక్రమం*
*54 మందికి కంటి పరీక్షలు నిర్వహించిన శరత్ మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ వైద్య బృందం*
హుజూరాబాద్,నవంబర్ 04(తెలంగాణ ముచ్చట్లు ):
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే సంకల్పంతో హుజూరాబాద్ పట్టణంలోని 5వ వార్డులో స్థానిక కౌన్సిలర్ సొళ్ళు సునీత ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ప్రజలకు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సలహాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఉచిత వైద్య శిబిరానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. శరత్ మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్‌కు చెందిన ప్రత్యేక వైద్య బృందం శిబిరంలో పాల్గొని ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించింది. కంటి చూపు మందగించడం, దృష్టి సంబంధిత సమస్యలు, ఇతర కంటి వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు. మొత్తం 54 మంది ఈ శిబిరంలో పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు.


Comments