వ్యవసాయ పనిముట్ల దొంగల ముఠా గుట్టురట్టు.

వ్యవసాయ పనిముట్ల దొంగల ముఠా గుట్టురట్టు.

- రెండు మినీ వ్యాన్లతో సహా రూ.6.50 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం.
- ఆరుగురి ముఠాలో ఐదుగురు అరెస్టు.. ఒకరు పరారీలో.

సత్తుపల్లి, నవంబరు 4(తెలంగాణ ముచ్చట్లు):

రైతుల వ్యవసాయ పొలాల్లో ఉంచిన ఫుల్ వీల్స్, ఇతర వ్యవసాయ పనిముట్లను దొంగిలిస్తున్న ముఠా గుట్టును వి.యం. బంజర పోలీసులు రట్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.6.50 లక్షల విలువైన చోరీ సొత్తుతో పాటు, దొంగతనాలకు ఉపయోగించిన రెండు మినీ వ్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. వి.యం. బంజర ఎస్‌ఐ ఎస్‌కే షకీర్, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు రాజమల్లు, శ్రీనివాస్‌లతో కలిసి బుధవారం సాయంత్రం ముత్తగూడెం గ్రామం వైపు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే వంతెన కింద వ్యవసాయ పనిముట్లతో లోడ్ చేసిన రెండు మినీ వ్యాన్లు కనిపించాయి. అనుమానంతో వాటిని తనిఖీ చేయగా, అందులో ఉన్న వ్యక్తులు పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. దీంతో పంచుల సమక్షంలో విచారించగా, చుట్టుపక్కల మండలాల్లోని రైతుల పొలాల్లో ఉంచిన ఫుల్ వీల్స్, ఇతర వ్యవసాయ సామగ్రిని దొంగిలిస్తున్నట్లు వెల్లడైంది. చోరీ చేసిన వస్తువులను ఒకచోట నిల్వ ఉంచి, విక్రయించేందుకు తిరువూరుకు తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఈ కేసులో పంతంగి చెన్న కేశవ్ (సత్యంపేట), కుంట రాఘవేంద్ర (రుద్రాక్షపల్లి), మేకల గోవర్ధన్, పుచ్చి ముత్తయ్య మురళీ గౌతమ్ (మొండివర్రె), గోపిన నవీన్ (కొత్త నారావారిగూడెం)లను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు ఎస్‌కే మస్తాన్ (శ్రీరాంపురం) పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు వేంసూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు కేసులు, వి.యం. బంజర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరు కేసుల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుల్లో ఫుల్ వీల్స్, డిస్కులు, ఇతర వ్యవసాయ సామగ్రిని అపహరించినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు విలువ సుమారు రూ.6.50 లక్షలుగా అంచనా వేశారు. చోరీ సొత్తు తరలించేందుకు ఉపయోగించిన రెండు మినీ వ్యాన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను సత్తుపల్లి న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఖమ్మం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, కల్లూరు ఏసీపీ పర్యవేక్షణలో కేసులను ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సత్తుపల్లి రూరల్ సీఐ శ్రీ సర్వే, వి.యం.IMG-20261104-WA0032IMG-20261104-WA0031 బంజర ఎస్‌ఐ ఎస్‌కే షకీర్, వేంసూరు ఎస్‌ఐ ప్రదీప్‌తో పాటు పోలీస్ సిబ్బంది చారి, రాజమల్లు, శ్రీనివాస్, బాలకృష్ణ, భరత్, పాషాలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
పెద్దమందడి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని గ్రామ ప్రజలు, పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల...
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.
మీ ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి అభినందనీయం.
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.
మద్దిగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక.