నీట మునిగిన వరి పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి.

నీట మునిగిన వరి పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి.

.- పంట నష్టంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి.
- రైతులకు అండగా ఉంటాం.

సత్తుపల్లి, నవంబరు 4(తెలంగాణ ముచ్చట్లు): 

మురసు తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలకు వరి పొలాలు నీట మునిగి పంట దెబ్బతినడంతో ఆందోళనలో ఉన్న రైతులకు భరోసా కల్పించేందుకు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. నీట మునిగిన వరి పొలాలను పరిశీలించి పంట పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని, దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి తుఫాన్ కారణంగా ఎదురైన ఇబ్బందులు, పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంపై అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా అంచనా వేసి నివేదిక రూపొందించాలని సూచించారు. రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోయిన సమయంలో ప్రభుత్వం వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, రైతులు అధైర్యపడవద్దని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, చల్లగుళ్ల నరసింహారావు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి, వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు, సత్తుపల్లి, వేంసూరు మండలాల కాంగ్రెస్ నాయకులు, గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
పెద్దమందడి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని గ్రామ ప్రజలు, పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల...
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.
మీ ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి అభినందనీయం.
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.
మద్దిగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక.