వంగర పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య.

వంగర పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య.

భీమదేవరపల్లి, నవంబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు): 

హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య బుధవారం భీమదేవరపల్లి మండలంలోని వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, ఔషధ నిల్వ గది, వ్యాక్సిన్ నిల్వ గదులను పరిశీలించారు. వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు, పురోగతిపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు నిరంతరం అందించాలని సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఏఎన్‌ఎంలు విధులకు దూరంగా ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో టీకా కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా పీహెచ్‌సీ స్థాయిలోనే వ్యాక్సినేషన్ సెషన్లు నిర్వహించాలని ఆదేశించారు.

ఈ మేరకు వంగర పీహెచ్‌సీలో నిర్వహించిన టీకాల కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 11 మంది లబ్ధిదారులకు మొత్తం 21 డోసుల టీకాలు అందించినట్లు సిబ్బంది వివరించారు.

సమ్మె పరిస్థితుల్లోనూ ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులకు అందించే టీకా సేవలు నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ నిరంతర సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ పేర్కొన్నారు.IMG-20261104-WA0006

Tags:

Post Your Comments

Comments

Latest News

వరద నీటి ఉధృతి.. మూడు రహదారులు మూసివేత. వరద నీటి ఉధృతి.. మూడు రహదారులు మూసివేత.
- నీటి ప్రవాహాన్ని తక్కువగా అంచనా వేయొద్దు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.- సీఐ తుమ్మలపల్లి శ్రీహరి. సత్తుపల్లి, నవంబరు 4(తెలంగాణ ముచ్చట్లు):  భారీ వర్షాల నేపథ్యంలో సత్తుపల్లి...
మురుసు తుపాన్ ధాటికి కూలిన పశువుల పెంకుటిల్లు.
నరహరి తండా దశాబ్దాల కల సాకారం దిశగా మరో ముందడుగు.. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం.
వంగర పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య.
టైలర్ కోట రవికి ఫ్రెండ్స్ ఫౌండేషన్ (ఎఫ్2) సభ్యుల ఘన నివాళి.
వృత్తి విద్యా బోధకుల వేతనాలకు గ్రహణం!
మండల సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహణ.