మురుసు తుపాన్ ధాటికి కూలిన పశువుల పెంకుటిల్లు.

మురుసు తుపాన్ ధాటికి కూలిన పశువుల పెంకుటిల్లు.

- ప్రహరీ గోడపై పడిన పైకప్పు.. గర్భంతో ఉన్న గేదెకు తీవ్ర గాయాలు.
- నడుముపై బలంగా పడిన దూలం.. లేవలేని స్థితిలో మూగజీవం.

సత్తుపల్లి, నవంబరు 4(తెలంగాణ ముచ్చట్లు): 

మురుసు తుపాన్ ప్రభావంతో బుధవారం తెల్లవారుజామున సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో దొడ్డా వెంకటేశ్వరరావుకు చెందిన పశువుల పెంకుటిల్లు కూలిపోయింది. బలమైన గాలుల ధాటికి పెంకుటిల్లు పైకప్పు కూలి పక్కనే ఉన్న ప్రహరీ గోడపై పడింది. ఈ క్రమంలో ఓ దూలం అక్కడే ఉన్న గర్భంతో ఉన్న గేదె నడుముపై బలంగా పడటంతో తీవ్రంగా గాయపడింది. దీంతో గేదె లేవలేని స్థితికి చేరుకుంది. గర్భంతో ఉన్న గేదెకు ప్రమాదం జరగడంతో యజమాని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న మరో రెండు దూడలు ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా బయటపడ్డాయి. పెంకుటిల్లు కూలడంతో దూలాలు, పెంకులు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పశువైద్యుడు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన గేదెకు చికిత్స అందించారు. ప్రస్తుతం గేదె కోలుకునేందుకు వైద్యం కొనసాగిస్తున్నారు. తుపాన్ ప్రభావంతో పశువుల పెంకుటిల్లు కూలిపోవడంతో పాటు గేదె తీవ్రంగా గాయపడటంతో యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో సుమారు నాలుగు లక్షల రూపాయల మేరఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.IMG-20261104-WA0003

Tags:

Post Your Comments

Comments

Latest News

వరద నీటి ఉధృతి.. మూడు రహదారులు మూసివేత. వరద నీటి ఉధృతి.. మూడు రహదారులు మూసివేత.
- నీటి ప్రవాహాన్ని తక్కువగా అంచనా వేయొద్దు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.- సీఐ తుమ్మలపల్లి శ్రీహరి. సత్తుపల్లి, నవంబరు 4(తెలంగాణ ముచ్చట్లు):  భారీ వర్షాల నేపథ్యంలో సత్తుపల్లి...
మురుసు తుపాన్ ధాటికి కూలిన పశువుల పెంకుటిల్లు.
నరహరి తండా దశాబ్దాల కల సాకారం దిశగా మరో ముందడుగు.. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం.
వంగర పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య.
టైలర్ కోట రవికి ఫ్రెండ్స్ ఫౌండేషన్ (ఎఫ్2) సభ్యుల ఘన నివాళి.
వృత్తి విద్యా బోధకుల వేతనాలకు గ్రహణం!
మండల సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహణ.