నరహరి తండా దశాబ్దాల కల సాకారం దిశగా మరో ముందడుగు.. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం.
హర్షం వ్యక్తం చేసిన తండ వాసులు .
Views: 57
On
భీమదేవరపల్లి,నవంబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు):
భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ నరహరి తండా ప్రజల దశాబ్దాల కల అయిన రోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. రోడ్డు నిర్మాణానికి మంజూరు లభించడంతో ముల్కనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి బుధవారం కొబ్బరికాయ కొట్టి పనులను లాంఛనంగా ప్రారంభించారు.
రోడ్డు నిర్మాణం పూర్తయితే నరహరి తండా ప్రజలకు దశాబ్దాలుగా ఎదురవుతున్న రాకపోకల ఇబ్బందులు తొలగి, రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. గ్రామాలు, తండాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్న సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డికి తండా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Nov 2026 16:23:04
- నీటి ప్రవాహాన్ని తక్కువగా అంచనా వేయొద్దు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.- సీఐ తుమ్మలపల్లి శ్రీహరి.
సత్తుపల్లి, నవంబరు 4(తెలంగాణ ముచ్చట్లు):
భారీ వర్షాల నేపథ్యంలో సత్తుపల్లి...


Comments