వరద నీటి ఉధృతి.. మూడు రహదారులు మూసివేత.

వరద నీటి ఉధృతి.. మూడు రహదారులు మూసివేత.

- నీటి ప్రవాహాన్ని తక్కువగా అంచనా వేయొద్దు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- సీఐ తుమ్మలపల్లి శ్రీహరి.

సత్తుపల్లి, నవంబరు 4(తెలంగాణ ముచ్చట్లు): 

భారీ వర్షాల నేపథ్యంలో సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రహదారులపైకి వరద నీరు ప్రవహిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజల భద్రత దృష్ట్యా మూడు రహదారుల్లో రాకపోకలను నిలిపివేశారు. సత్తుపల్లి పట్టణంలోని సిద్దారం రోడ్డులో ఎంఆర్ గార్డెన్ సమీపంలో, కిష్టారం నుంచి యాతాలకుంటకు వెళ్లే రహదారిపై, రుద్రాక్షపల్లి నుంచి నాచారం వెళ్లే మార్గంలో నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఆయా రహదారులను పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి సీఐ తుమ్మలపల్లి శ్రీహరి మాట్లాడుతూ.. వరద నీటి ఉధృతిని తక్కువగా అంచనా వేసి రహదారులను దాటేందుకు ప్రయత్నించవద్దని ప్రజలకు సూచించారు. ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ, ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వరద నీటి ఉధృతి.. మూడు రహదారులు మూసివేత. వరద నీటి ఉధృతి.. మూడు రహదారులు మూసివేత.
- నీటి ప్రవాహాన్ని తక్కువగా అంచనా వేయొద్దు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.- సీఐ తుమ్మలపల్లి శ్రీహరి. సత్తుపల్లి, నవంబరు 4(తెలంగాణ ముచ్చట్లు):  భారీ వర్షాల నేపథ్యంలో సత్తుపల్లి...
మురుసు తుపాన్ ధాటికి కూలిన పశువుల పెంకుటిల్లు.
నరహరి తండా దశాబ్దాల కల సాకారం దిశగా మరో ముందడుగు.. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం.
వంగర పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య.
టైలర్ కోట రవికి ఫ్రెండ్స్ ఫౌండేషన్ (ఎఫ్2) సభ్యుల ఘన నివాళి.
వృత్తి విద్యా బోధకుల వేతనాలకు గ్రహణం!
మండల సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహణ.