ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.

మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి.

ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.

పెద్దమందడి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు):

ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను, ప్రశ్నించే గొంతుకలను అణచివేయలేరని వనపర్తి జిల్లా  పెద్దమందడి మండల మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి అన్నారు. గురువారం ఉదయం తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ మండల కమిటీ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని పోలీసుల ద్వారా అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.అరెస్టులకు బీఆర్ఎస్ భయపడబోదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందస్తు అరెస్టులను నిలిపివేసి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రఘుపతి రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భీమదేవరపల్లి మండల కేంద్రంలో అల్పాహార పథకం ప్రారంభం. భీమదేవరపల్లి మండల కేంద్రంలో అల్పాహార పథకం ప్రారంభం.
భీమదేవరపల్లి, నవంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించేందుకు చేపట్టిన పథకాన్ని భీమదేవరపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్...
ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.
మీ ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి అభినందనీయం.
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.