భీమదేవరపల్లి మండల కేంద్రంలో అల్పాహార పథకం ప్రారంభం.
భీమదేవరపల్లి, నవంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించేందుకు చేపట్టిన పథకాన్ని భీమదేవరపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో గురువారం సర్పంచ్ మాచర్ల కుమారస్వామి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చదువుపై ఏకాగ్రత, ఆసక్తి పెరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, వేణుగోపాల్, ఉపసర్పంచ్ శనిగరం ఐలయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మాచర్ల లక్ష్మి, వార్డు సభ్యులు సంధ్య, శ్రీనివాసరెడ్డి, శ్యామ్, వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యమే గ్రామ భవిష్యత్తుకు పునాది అనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పథకం పాఠశాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా నిలవనుంది.


Comments