వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి ఉద్యమకారులకు తీరని లోటు.

వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి ఉద్యమకారులకు తీరని లోటు.

* వేముల లక్ష్మణ్ గౌడ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి

* టీ యు ఎఫ్ నాయకుల డిమాండ్

జమ్మికుంట, నవంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి తీరని లోటని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీ యు ఎఫ్) నాయకులు అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో కీర్తిశేషులు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని బుధవారం టీ యు ఎఫ్ నాయకులు పరామర్శించి, ఆయన తండ్రి మల్లయ్య గౌడ్‌తో పాటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ సందర్భంగా టీ యు ఎఫ్ రాష్ట్ర సెక్రటరీ జనరల్, జిల్లా అధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి మాట్లాడుతూ.. 2006 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేముల లక్ష్మణ్ గౌడ్ అలుపెరుగని పోరాటం చేశారని గుర్తుచేశారు. అలాంటి ఉద్యమకారుడు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తిని కోల్పోవడం తీరని లోటని, ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు.

1200 మంది అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు ఆశించిన గుర్తింపు, గౌరవం లభించకపోవడం విచారకరమని సంజీవరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కోసం తమ జీవితాలను, కుటుంబాలను సైతం పక్కనపెట్టి పోరాడిన అసలైన ఉద్యమకారులకు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం తగిన న్యాయం చేయలేకపోయాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన ఉద్యమకారులందరికీ ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, ఆయన భార్య స్వప్నకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. కేవలం సానుభూతి ప్రకటనలకే పరిమితం కాకుండా బాధిత కుటుంబానికి ఆచరణలో న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

టీ యు ఎఫ్ ఫౌండర్ డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కుటుంబంలో ఆత్మీయుడిని కోల్పోవడం మాటల్లో వర్ణించలేని విషాదమని అన్నారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి కలిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. మల్లయ్య గౌడ్‌తో పాటు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, లక్ష్మణ్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో టీ యు ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్యామల, ఉమ్మడి జిల్లాIMG-20261105-WA0034 అధ్యక్షుడు రజినీకాంత్, రాష్ట్ర నాయకులు జోగు అంజన్న, దయానంద్, జిల్లా అధ్యక్షుడు రాజు, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆరే రమేష్ రెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు మద్దూరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి ఉద్యమకారులకు తీరని లోటు. వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి ఉద్యమకారులకు తీరని లోటు.
* వేముల లక్ష్మణ్ గౌడ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి * టీ యు ఎఫ్ నాయకుల డిమాండ్ జమ్మికుంట, నవంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ...
ఇంటింటా పచ్చదనం.. సిరిసేడులో హరిత విప్లవానికి శ్రీకారం!
వరద బాధితులకు భరోసా.. క్షేత్రస్థాయిలో నష్టాల పరిశీలన.
భీమదేవరపల్లి మండల కేంద్రంలో అల్పాహార పథకం ప్రారంభం.
ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.