వరద బాధితులకు భరోసా.. క్షేత్రస్థాయిలో నష్టాల పరిశీలన.

వరద బాధితులకు భరోసా.. క్షేత్రస్థాయిలో నష్టాల పరిశీలన.

- మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ రఘురామ్ రెడ్డి, ఎమ్మెల్యే జారె పర్యటన.
- బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం.

అశ్వారావుపేట, నవంబరు 5(తెలంగాణ ముచ్చట్లు): 

మురసు తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా అశ్వారావుపేట మండలంలోని పలు ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబుతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వరద నీటికి దెబ్బతిన్న ఇళ్లు, నీట మునిగిన పంట పొలాలు, దెబ్బతిన్న రహదారులు, చెరువులను పరిశీలించారు. స్థానిక ప్రజలను కలిసి వరదల కారణంగా ఎదురైన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన బాధితులందరికీ నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరదలకు దెబ్బతిన్న రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, చెరువులు, కాలువల్లో నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు నిరంతరాయంగా అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ముఖ్యంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. IMG-20261105-WA0032

Tags:

Post Your Comments

Comments

Latest News

వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి ఉద్యమకారులకు తీరని లోటు. వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి ఉద్యమకారులకు తీరని లోటు.
* వేముల లక్ష్మణ్ గౌడ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి * టీ యు ఎఫ్ నాయకుల డిమాండ్ జమ్మికుంట, నవంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ...
ఇంటింటా పచ్చదనం.. సిరిసేడులో హరిత విప్లవానికి శ్రీకారం!
వరద బాధితులకు భరోసా.. క్షేత్రస్థాయిలో నష్టాల పరిశీలన.
భీమదేవరపల్లి మండల కేంద్రంలో అల్పాహార పథకం ప్రారంభం.
ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.