పెండింగ్ వేతనాల కోసం వొకేషనల్ ట్రైనర్ల సచివాలయ ముట్టడి.

పెండింగ్ వేతనాల కోసం వొకేషనల్ ట్రైనర్ల సచివాలయ ముట్టడి.

300 మందికి పైగా ట్రైనర్లతో కదంతొక్కిన ఉద్యమం.. 

10 రోజుల్లో వేతనాలు చెల్లిస్తామని అధికారుల హామీ

హైదరాబాద్,నవంబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు):

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ వృత్తి విద్యా శిక్షకులు కదంతొక్కారు. తెలంగాణ వృత్తి విద్యా శిక్షకుల సంఘం (టీవీటీఏ) పిలుపు మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 300 మందికి పైగా శిక్షకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన శిక్షకులు, అనంతరం రాష్ట్ర సచివాలయం వరకు ర్యాలీగా వెళ్లి తమ నిరసనను తెలియజేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు వేల మందికి పైగా వృత్తి విద్యా శిక్షకులు సమగ్ర శిక్ష పరిధిలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, గత పన్నెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగానే తమకూ వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ఓవైపు ప్రభుత్వం నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తూ, వృత్తి విద్యా కోర్సులకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రయత్నిస్తున్న తరుణంలో, వృత్తి విద్యను బోధిస్తున్న తమ పట్ల నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, తమకు వేతనాలు అందక రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని, సాధారణ సెలవుల సంఖ్య పెంచాలని, ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ఈ విద్యా సంవత్సరం నుంచి పన్నెండు నెలల వేతనం వర్తింపజేయాలని కోరారు.

అధికారులతో చర్చలు.. పలు హామీలు

సచివాలయం వద్ద నిరసన కొనసాగిస్తున్న క్రమంలో పోలీసుల విజ్ఞప్తి మేరకు సంఘం ప్రతినిధులు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌తో పాటు విద్యాశాఖ కార్యదర్శిని కలిసి తమ సమస్యలు, డిమాండ్లను వివరించారు.
ఈ సందర్భంగా అధికారులు పలు హామీలు ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు వెల్లడించారు. మరో పది రోజుల్లో ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్న దస్త్రాన్ని ఆమోదింపజేసి వేతనాలు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెలలోనే సాధారణ సెలవుల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారని వెల్లడించారు.అదేవిధంగా నిధులను సర్దుబాటు చేసి ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పన్నెండు నెలల వేతనం అందించేలా ప్రయత్నిస్తామని, ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.

హామీలు అమలయ్యే వరకు పోరాటం ఆగదు!

ఈ నిరసన కార్యక్రమం ద్వారా వృత్తి విద్యా శిక్షకుల ఐక్యత, పోరాట పటిమ మరోసారి చాటిచెప్పామని సంఘం నాయకులు పేర్కొన్నారు. అధికారుల నుంచి సానుకూల స్పందన లభించినప్పటికీ, ఇచ్చిన హామీలన్నీ కార్యరూపం దాల్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి వృత్తి విద్యా శిక్షకుడికి తెలంగాణ వృత్తి విద్యా శిక్షకుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఒక్కరి కోసం అందరం.. అందరి కోసం ఒక్కరం.. అనే నినాదంతో తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుతామని ప్రకటించారు.IMG-20261104-WA0039IMG-20261104-WA0038

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
పెద్దమందడి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని గ్రామ ప్రజలు, పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల...
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.
మీ ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి అభినందనీయం.
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.
మద్దిగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక.