మద్దిగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక.

ఆలయ చైర్మన్‌గా చాపల శివరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక.

మద్దిగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక.

పెద్దమందడి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో ఎన్నుకున్నారు. ఆలయ చైర్మన్‌గా చాపల శివరెడ్డి, ఉపాధ్యక్షుడిగా వి. నరసింహ చారి, కోశాధికారిగా జల్లి నరసింహను ఎంపిక చేశారు. వీరితో పాటు 20 మంది సభ్యులతో కూడిన నూతన కమిటీని, గ్రామ పెద్దలను గౌరవ అధ్యక్షులుగా నియమించారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలను గ్రామ పెద్దలు, మహిళలు, యువకుల సహకారంతో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి గ్రామ పెద్దలు, యువతతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకుల సహకారం తీసుకుంటూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు.ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు గ్రామ ప్రజలు, యువకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భీమదేవరపల్లి మండల కేంద్రంలో అల్పాహార పథకం ప్రారంభం. భీమదేవరపల్లి మండల కేంద్రంలో అల్పాహార పథకం ప్రారంభం.
భీమదేవరపల్లి, నవంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించేందుకు చేపట్టిన పథకాన్ని భీమదేవరపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్...
ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.
మీ ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి అభినందనీయం.
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.