ఎమ్మెల్సీ ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలి.

కొమ్ము వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు.

ఎమ్మెల్సీ ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలి.

పెద్దమందడి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేసుకోవాలని వనపర్తి జిల్లా పెద్దమందడి మండల మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ముఖ్యంగా అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుగానే ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు.అలాగే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. పట్టభద్రులు ఓటరు నమోదుతో పాటు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
పెద్దమందడి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని గ్రామ ప్రజలు, పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల...
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.
మీ ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి అభినందనీయం.
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.
మద్దిగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక.