ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.

ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.

భీమదేవరపల్లి, నవంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు): 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమం బుధవారం ముల్కనూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైంది.

ఈ కార్యక్రమాన్ని ముల్కనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, ఉపసర్పంచ్ కాసగోని మమత బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అల్పాహారం అందించారు.

కార్యక్రమంలో 8వ వార్డు సభ్యుడు, మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చిటుకూరి అనిల్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకుడు చిటుకూరి నితిన్, గుడికందుల రాజు, గిరబోయిన అఖిల్, వెంకటేష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, చదువుపై ఆసక్తిని పెంపొందించి పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు విద్యాభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడనుంది.IMG-20261105-WA0012

Tags:

Post Your Comments

Comments

Latest News

భీమదేవరపల్లి మండల కేంద్రంలో అల్పాహార పథకం ప్రారంభం. భీమదేవరపల్లి మండల కేంద్రంలో అల్పాహార పథకం ప్రారంభం.
భీమదేవరపల్లి, నవంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించేందుకు చేపట్టిన పథకాన్ని భీమదేవరపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్...
ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.
మీ ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి అభినందనీయం.
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.