హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన వొడితల ప్రణవ్.
రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా.. సమస్యల పరిష్కారానికి హామీ.
హుజురాబాద్,నవంబర్ 06(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించేందుకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించి వైద్య సేవల తీరును పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్యం, మందుల లభ్యత, వైద్య సిబ్బంది పనితీరు, ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గంలోని నలుమూలల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుంటారని తెలిపారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఆసుపత్రిలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు తాము ఆసుపత్రిని సందర్శించినట్లు పేర్కొన్నారు.


Comments