మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ అశోక్.

మహిళా భవనం ఆవరణలో రెండు టాయిలెట్ల నిర్మాణ పనులు ప్రారంభం.

మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ అశోక్.

వేలేరు, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా వేలేరు మండలం శాలపల్లి గ్రామంలో మహిళా సంఘాల సభ్యుల సౌకర్యార్థం ఇటీవల ప్రారంభమైన మహిళా భవనం ఆవరణలో ఎస్‌బీఎం గ్రాంట్ నిధులతో రెండు టాయిలెట్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. శుక్రవారం సర్పంచ్ కూరపాటి అశోక్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కిషన్ నాయక్, ఎంపీఓ బుచ్చిరెడ్డితో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. మహిళలకు గతంలో ఇచ్చిన హామీ మేరకు టాయిలెట్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మహిళా సంఘాల సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు వచ్చే మహిళలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గ్రామ మహిళల సంక్షేమం కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మౌలిక సదుపాయాలు కల్పించడంపై మహిళా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎర్రగొల్ల రమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు పోతారబోయిన సతీష్, వార్డు సభ్యులు దేవరాజు, వెంకటేష్, గ్రామ కార్యదర్శి విజయ్, మహిళా సంఘాల అధ్యక్షురాలు మండల లావణ్య, సీఏ స్వరూప, కార్యదర్శి స్వరూప, మహిళా సంఘాల సభ్యులు, ఎఫ్ఏ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్.
కరీంనగర్, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు): క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్...
బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన కొయ్యడ మహేందర్.
మల్లికుదుర్ల పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్.
మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.
మారుతి నగర్ అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు.
గ్రామాభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదు.
ఎంఎస్ఎఫ్ బలోపేతానికి నూతన కమిటీల ఏర్పాటు.